బేగంపేట ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో మూల మలుపు వద్ద కేబుల్స్ తెగి వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. వారం రోజులుగా పరిస్థితి ఇలాగే ఉంది. ఆ రోడ్డుపై నుంచి వచ్చిపోయే వాహనదారులకు ఇబ్బందికరంగా ఉన్నాయి. అయినా అలాగే వెళ్లక తప్పని పరిస్థితి ఉంది. పైపులు వేలాడుతూ ఉన్నా సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడే స్పందిచేలా ఉన్నారు. –వెలుగు, ఫొటోగ్రాఫర్
