దేశంలో ఒక్కరోజే సుమారు 15 లక్షల కరోనా టెస్టులు

దేశంలో ఒక్కరోజే సుమారు 15 లక్షల కరోనా టెస్టులు

దేశంలో కరోనా తీవ్రత రోజురోజూకూ పెరుగుతూనే ఉంది. గ‌త 24 గంట‌ల్లో దేశంలో 86,052 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర కుటుంబ మరియు సంక్షేమ శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58 లక్షల మార్కును దాటింది. కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు దేశంలో నమోదయిన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 58,18,571కి చేరింది. ఇందులో 9,70,116 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారినపడి కోలుకున్న వారిసంఖ్య 47,56,165గా ఉంది. గురువారం దేశవ్యాప్తంగా 1,141 మంది కరోనాతో మ‌రణించారు. దాంతో దేశంలో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 92,290కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 14,92, 409 మందికి కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దాంతో ఇప్పటివరకు దేశంలో 6,89,28,440 టెస్టులు చేసినట్లు తెలిపింది.

For More News..

వారంలో రూ. 2,500 తగ్గిన గోల్డ్ ధర

రాష్ట్రంలో మరో 2,381 కరోనా కేసులు

చంచల్​గూడ జైలుకు రిమాండ్ ఖైదీగా ఏసీపీ నర్సింహారెడ్డి