- రఘురామ్‌రాజన్ వెల్లడి
- రాహుల్ గాంధీతో వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ: కరోనాను అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలను అదుకునేందుకు దాదాపు రూ.65కోట్లు అవసరమని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ అన్నారు. కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావం గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రఘురామ్‌రాజన్ మాట్లాడారు. లాక్‌డౌన్‌ను ఇంకా కొన్ని రోజులు విధిస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింతుందని చెప్పారు. చాలా కాలం లాక్‌డౌన్‌ను పొడిగించడం మంచిదే అయినప్పటికీ ప్రజలను పోషించే స్తోమత మనదేశానికి లేదని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ విధించడం ఎంత ఈజీనో ఎత్తేయడం కష్టం అని, దానికి సరైన ప్రణాళిక అవసరమని రాజన్ అన్నారు. ఇద్దరు దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ప్రస్తుతం చికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రఘురామ్‌రాజన్ కాంగ్రెస్ హయాంలో మూడు ఏళ్ల పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా సేవలందించారు.
