బయో టెర్రరిజాన్ని దీటుగా ఎదుర్కోవాలి

బయో టెర్రరిజాన్ని దీటుగా ఎదుర్కోవాలి

న్యూఢిల్లీ: బయో టెర్రరిజం ముప్పును దీటుగా ఎదుర్కొనే చర్యలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ అన్నారు. ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ (ఏడీఎంఎం-ప్లస్) పదో సదస్సులో పాల్గొన్న రాజ్‌‌నాథ్.. మహమ్మార వ్యాధులు, బయో టెర్రరిజంపై తన అభిప్రాయాలు చెప్పారు. నిబంధనలతో కూడిన సరిహద్దులు, సముద్ర భద్రత, సైబర్ సంబంధిత నేరాలతోపాటు ఉగ్రవాద బెదిరింపులు లాంటి సవాళ్లను పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ఏడీఎంఎం ప్లస్‌‌లో ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్, న్యూజిలాండ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రష్యా, యునైటెడ్ స్టేట్స్ దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ఆసియాన్ రీజియన్‌‌లో భద్రతను బలోపేతం చేయడంతోపాటు సుస్థిర శాంతియుత పరిస్థితుల కొనసాగింపునకు రక్షణ సహకారం కోసం ఏడీఎంఎం ప్లస్ కృషి చేస్తుంది.