పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన సినిమా ‘నీలకంఠ’. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్. రాకేష్ మాధవన్ దర్శకత్వంలో మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మించారు. జనవరి 2న సినిమా విడుదల కానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేంద్రన్ మాట్లాడుతూ ‘కంటెంట్‌తోపాటు ఎమోషన్ ఉన్న చిత్రమిది. చేయని తప్పుకు ఊరంతా తన మీద నింద మోపితే హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది’ అని అన్నాడు.
ఈ చిత్రంలో నటించడం మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చిందని యష్న చెప్పింది. డైరెక్టర్ రాకేష్ మాధవన్ మాట్లాడుతూ ‘ఇందులో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. ఫైట్స్, సాంగ్స్ ఆకట్టుకుంటాయి’ అని అన్నాడు. ట్రైలర్ లాగే, సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంటుందని నిర్మాతలు అన్నారు.
