మియాపూర్, వెలుగు: నీట్‌కు ప్రిపేర్అవుతు న్న ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన మియాపూర్ పీఎస్పరిధిలో జరిగింది. ఇన్స్పె క్టర్ శివ ప్రసాద్కథనం ప్రకారం.. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన షేక్ జాఫర్ హుస్సేన్, షేక్ అబ్బునిస్సా దంపతు లకు ముగ్గురు కుమార్తెలు. వీరు హఫీజ్‌పేట్‌లోని జయభేరి కల్పన అపార్ట్మెంట్ ఐదో ఫ్లోర్‌లోని 501 ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. వీరిమొదటి కుమార్తె షేక్ సనా(19) ఇంటర్ పూర్తి చేసి నీట్‌కు ప్రిపేర్ అవుతోంది. గతేడాది నీట్రాసినా ర్యాంక్ రాలేదు. దీంతో ఈ సారి మళ్లీ ప్రిపేర్ అవుతుంది.
ఈ నెల 21న సనా నీట్రాయాల్సి ఉంది. తండ్రి ఉద్యోగ రీత్యా కువైట్‌లో నివాసం ఉంటుండగా.. పది రోజుల కింద సనా తల్లి సొంతూరుకు వెళ్లింది. శనివారం ఉదయం ముగ్గురు అక్కాచెల్లెలు కలిసి టిఫిన్ చేశారు. తర్వాత సనా చదువుకోవడానికి తన గదిలోకి వెళ్లింది.
సాయంత్రం అయినా బయటకు రాకపోవడంతో చెల్లెల్లు గది తలుపులు తెరిచి చూశారు. సనా ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే స్థానికుల సాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. సమా చారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సనా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అమె గదిలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘తల్లిదండ్రులను మెప్పించలేక పోతున్నా.. నా చావుకు బాధ్యులు ఎవరు కారు.. సారీ.. జీవితంలో విఫలమయ్యాను’ అని రాసి ఉంది. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
