గ్రేటర్​ హైదరాబాద్‌లో నీట్ ప్రశాంతం

గ్రేటర్​ హైదరాబాద్‌లో నీట్ ప్రశాంతం

హైదరాబాద్​సిటీ వెలుగు : వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌‌‌‌-పరీక్ష గ్రేటర్ పరిధిలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. విద్యార్థులను సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. విద్యార్థుల నుంచి గడియారాలు, చెవి కమ్మలు, మెడలో గొలుసు, కాళ్ల పట్టీలు, ముక్కుపుడకలు తొలగించారు.

 అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మాసబ్ ట్యాంక్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో నీట్​పరీక్షా కేంద్రాన్ని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి​తనిఖీ చేశారు. ఏర్పాట్ల గురించి సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు.