నీట్​ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి.. వికారాబాద్​ కలెక్టర్​ ప్రతీక్​జైన్

నీట్​ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి.. 	వికారాబాద్​ కలెక్టర్​ ప్రతీక్​జైన్

వికారాబాద్, వెలుగు: వికారాబాద్​జిల్లాలో నీట్​పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రతీక్​జైన్ ఆదేశించారు. గురువారం తన చాంబర్ లో నీట్-2025 పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు.  మే 4న నిర్వహించే నీట్ పరీక్షకు వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేయగా, 1,193 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. 

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి అడ్మిట్ కార్డు, పాస్​పోర్టు సైజ్ ఫొటో తప్పిస్తే ఎలాంటి వస్తువులు తీసుకురాకూడదన్నారు. సందేహాల కోసం కంట్రోల్ రూం నంబర్ 08416-235291కు శని, ఆదివారాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల లోపు  సంప్రదించాలని సూచించారు. 

అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, డీఈఓ రేణుకాదేవి, ఆర్డీఓ వాసు చంద్ర, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ నైమత్ అలీ,  డీఎస్పి శ్రీనివాస్ రెడ్డి, సీఐ భీమ్ కుమార్ పాల్గొన్నారు.