నీట్ అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలి : మంత్రి శ్రీధర్ బాబు

 నీట్ అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలి :  మంత్రి శ్రీధర్ బాబు

నీట్ పరీక్షల్లో అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. 63 మంది విద్యార్థులకు ఒకే ర్యాంక్ రావడం అనుమానాలకు తావిచ్చిందని, విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్–1 ప్రిలిమినరీ  పరీక్షను విజయవంతంగా  నిర్వహించామన్నారు. 

గ్రూప్ 2,3లో పోస్టుల సంఖ్య  పెంచాలని కొందరు ధర్నా చేస్తున్నారని, దాదాపు ఐదున్నర లక్షల మంది దరఖాస్తు చేశారని వాటిని నిర్వహిస్తామని అన్నారు.  ఖాళీలను గుర్తించి త్వరలో గ్రూప్–2,3కి మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ కూడా త్వరలోనే ఇస్తామన్నారు. న్యాయ పరమైన సలహాలు తీసుకొని జీవో 46 పై డెసిషన్ తీసుకుంటామని చెప్పారు.  గ్రూప్ -1 విషయంలో 1:50 కి బదులుగా 1:100 ప్రాతిపదికన తీయాలని నిరుద్యోగులు అడుగుతున్నారని దానిపైనా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.