హైదరాబాద్, వెలుగు: నీట్ యూజీ ఎగ్జామ్ కోసం సిలబస్ ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సోమవారం విడుదల చేసింది. దానిని మంగళవారం వెబ్ సైట్ లో పెట్టింది. 2026–-27 అకడమిక్ ఇయర్ కు సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (యూజీఎంఈబీ) ఈ సిలబస్ ను ఫైనల్ చేసింది. విద్యార్థులు, విద్యాసంస్థలు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకునేందుకు వీలుగా ముందుగానే ఈ వివరాలను వెల్లడించినట్టు ఎన్ఎంసీ సెక్రటరీ డాక్టర్ రాఘవ్ లాంగర్ తెలిపారు.
