కరోనాపై నిర్లక్ష్యం: హెల్త్ డైరెక్టర్ కు కోర్టు ధిక్కరణ నోటీసు

V6 Velugu Posted on Nov 26, 2020

కరోనా జాగ్రత్తలకు సంబంధించిన జీవో 64 అమలు బాధ్యతలు జీహెచ్ఎంసీకి అప్పగించడంపై హైకోర్టు ఆశ్చర్యం

కరోనా పై ఏం చేస్తున్నారు..?  రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: కరోనా పై ఏం చేస్తున్నారు..? అంటూ   ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస రావుకు  హైకోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసిని హైకోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా మహమ్మారిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. రోజుకు 50వేలు, వారానికోసారి లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. అయితే రోజుకు 50 వేల పరీక్షలు అవసరం ఉన్నప్పుడు చేస్తామని నివేదికలో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలియజేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు రోజుకు 50 వేలు, వారానికో రోజు లక్ష కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వానికి మరోసారి ఆదేశించింది.

కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రాజకీయ సమావేశాలకు అనుమతి ఇవ్వాలని మరోసారి ఆదేశాలిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, ఐసీఎంఆర్ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. జీఎచ్ఎంసీ లో మాస్కులు,  భౌతిక దూరం వంటి నిబంధనలు సరిగా అమలు కావడం లేదన్న హైకోర్టు..  కరోనా జాగ్రత్తలకు సంబంధించిన జీవో 64 అమలు బాధ్యత జీహీచ్ఎంసీకి అప్పగించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జీవో 64 అమలు అధికారం పోలీసులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేట్ ఆస్పత్రుల ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా మరణాలపై ఆడిట్ కమిటీ ఏర్పాటును పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే కరోనా బాధితులకు ధైర్యం కలిగించేలా మానసిక కేంద్రం ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశింది. డిసెంబరు 15లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి  విచారణ డిసెంబర్ 17కి వాయిదా వేసింది.

Tagged POLICE, responsibilities, ghmc, Department, corona deaths, private hospitals, 17th december 2020, action against, audit committee, case adjourned, court contempt notice, director of health, go 64, Health Director, high court issued, implimentation, neglect of corona, Srinivas Rao

Latest Videos

Subscribe Now

More News