తప్పుల తడకగా ఓటరు లిస్టు : ఫోటో బదులు కిటికీ, బీరువా

తప్పుల తడకగా ఓటరు లిస్టు : ఫోటో బదులు కిటికీ, బీరువా

నిజామాబాద్ జిల్లా : ఓటర్ల జాబితా తయారీలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ అధికారులు తప్పుల తడకగా తయారు చేశారు. ఓటరు ఫోటో బదులు కిటికీ, బీరువా ఫోటోలు పెట్టారు. 48వ పోలింగ్ కేంద్రంలో తల్లి, కుమారుడి పేర్లు, ఫోటోలు పక్కపక్కనే 2చోట్ల ఉన్నాయి.

36వ వార్డులో ఒక హిందువు ఇంటికి 12 మంది ముస్లిం ఓటర్లను జతచేశారు. ఓటరు ఫొటో బదులు వస్తువుల ఫొటోలు, ఒక్కొక్కరి పేర్లు రెండు చోట్ల, ఐదేళ్ల కిందట చనిపోయిన వారి పేర్లు కూడా జాబితాలో ఉండడం గమనార్హం. అంతేగాక కులాలను కూడా మార్చేశారు. ఓటరు జాబితా తయారీలో అధికారుల నిర్లక్ష్యంపై జనం మండిపడుతున్నారు.