క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ బౌలర్

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ బౌలర్

న్యూజిలాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నెర్ తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ తనకు చివరిదని కివీస్ స్టార్ పేసర్ భావోద్వేగానికి గురయ్యాడు.ఈ నిర్ణయం చాలా కఠిన మైనదని.. అయితే ముందుకు సాగడానికి ఇదే సరైన సమయమని ఈ 37 ఏళ్ళ ఫాస్ట్ బౌలర్ తెలియజేశాడు.ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ కూడా అధికారికంగా ధ్రువీకరించింది. 

దేశం కోసం ఆడిన ప్రతి క్షణాన్ని ఆనదించానని.. జట్టుగా సాధించిన దానికి గర్వపడుతున్నామని వాగ్నర్ అన్నారు. ఎంతోమంది గొప్ప క్రికెటర్లతో డ్రెసింగ్ రూమ్ పంచుకోవడం ఆనందంగా ఉందని.. 12 ఏళ్ళ క్రికెట్ ప్రయాణంలో నా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాని చెప్పుకొచ్చాడు. కుర్రాళ్ళకు అవకాశం ఇవ్వడానికే జట్టు నుంచి వైదొలుగుతున్నానని అన్నాడు.  

2012 లో వాగ్నర్ వెస్టిండీస్ తో మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. కివీస్ తరపున టెస్టులు మాత్రమే ఆడిన వాగ్నర్.. తనదైన ముద్ర వేసాడు. ఇప్పటివరకు 64 టెస్టుల్లో 260 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్ గా వాగ్నర్ నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఇతను న్యూజిలాండ్ దేశంకు మకాం మార్చాడు. 2021 లో భారత్ పై వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలవడంలో వాగ్నర్ కీలక పాత్ర పోషించాడు.