
‘స్వాతిముత్యం’ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇస్తున్న బెల్లంకొండ గణేష్ తన రెండో సినిమాను ప్రకటించాడు. నేను స్టూడెంట్ సార్ అనే టైటిల్‌తో గణేష్ రెండో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి రాకీ ఉప్పలపాటీ దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‌వీ2 ఎంటర్టైనమెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ను మేకర్స్ రీలిజ్ చేశారు.
ఫస్ట్‌లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పోస్టర్‌లో గణేష్ పై పోలీసులు తుపాకీలను గురిపెట్టడం, చేతిలో ఐడీ కార్డు పట్టుకొని భయంతో గణేష్ నిల్చున్నట్టుగా పోస్టర్ లో కనిపిస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి మహాతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, సముద్రఖని, సునీల్ కీరోల్ ప్లే చేస్తున్నారు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అటు గణేష్ స్వాతిముత్యం మూవీ అక్టోబర్ 5న విడుదల కానుంది.
A unique thriller that flaunts the courage of a student in an outrageous way!
— ??? ????????????? (@SV2Ent) September 9, 2022
Presenting the Title & First Look of @SV2Ent #ProductionNo2#??????????????✊
?ing #GaneshBellamkonda
?@NaandhiSATISH
? #RakhiUppalapati@mahathi_sagar @manithkumar @ChotaKPrasad pic.twitter.com/gsbUviG13g