ఎన్ఈపీ–2020ని రద్దు చేయాలి : ప్రొఫెసర్ హరగోపాల్

ఎన్ఈపీ–2020ని రద్దు చేయాలి :  ప్రొఫెసర్  హరగోపాల్

ముషీరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హరగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. భారత్ బచావో పేరిట సోమవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత యూనివర్సిటీల విద్యార్థుల కాన్ఫరెన్స్ జరిగింది. ప్రొఫెసర్ హరగోపాల్, ఢిల్లీ ప్రొఫెసర్ నిరంజన్ ఆరాధ్య, రామ్ పునియాని, గాదె ఇన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ నిరంజన్ ఆరాధ్య మాట్లాడుతూ.. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈపీ–2020 కేవలం మూఢత్వాల గురించి తప్పితే శాస్త్రీయత దృక్పథం గురించి మాట్లాడడం లేదన్నారు. రామ్ పునియాని మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో గోపినాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రమేశ్, సిద్ధార్థ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సుజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సుశీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  తదితరులు పాల్గొన్నారు.