ఫ్రాన్స్ కు చెందిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభ రాజ్ ను రిలీజ్ చేయాలని నేపాల్ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అతడి వయసును దృష్టిలో పెట్టుకుని విడుదల చేయాలని పేర్కొంది. నేపాల్ జైలులో 2003 నుంచి శోభ రాజ్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇద్దరు అమెరికన్ టూరిస్టులను ఖాట్మండులో హత్య చేశాడన్న ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. దీంతో అతడు 2003 నుంచి జైలులో ఉన్నాడు.
ఫేక్ పాస్ పోర్టుతో నేపాల్ లోకి ఎంటరై, 1975లో ఇద్దరు అమెరికన్ టూరిస్టులను చంపాడన్న అభియోగాలు నమోదయ్యాయి. పారిస్ లో 1963లో మొదటిసారి క్రైమ్ చేశాడు. ఆ తర్వాత వరుస నేరాలకు పాల్పడడంతో పేరు మార్మోగిపోయింది. శోభ రాజ్ తండ్రి ఇండియన్, తల్లి వియత్నాం దేశానికి చెందిన వారు. ఈ ఇద్దరు విడిపోయాక.. చార్లెస్ ను వెంటబెట్టుకుని అతడి తల్లి ఫ్రాన్స్ వెళ్లారు.
