ఆదిపురుష్ ఎఫెక్ట్.. అక్కడ భారత్ సినిమాలన్నీ బ్యాన్

ఆదిపురుష్ ఎఫెక్ట్.. అక్కడ భారత్ సినిమాలన్నీ బ్యాన్

ఆదిపురుష్(Adipurush) సినిమాపై నేపాల్(Nepal) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 19 నుండి ఆదిపురుష్‌తో పాటు భారత్‌ నుండి రిలీజయ్యే ఏ సినిమా కూడా నేపాల్ లో ప్రదర్శించబడదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతేకాదు ప్రస్తుతం నేపాల్లో రన్ అవుతున్న.. బాలీవుడ్ సినిమాలను థియేటర్ల నుంచి తొలగించి.. వాటి స్థానంలో హాలీవుడ్​ సినిమాలను, నేపాలీ సినిమాలను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇక ప్రభాస్‌ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్‌ సినిమాపై కేవలం భారత్ లోనే కాదు నేపాల్ లో కూడా వివాదం చెలరేగింది. సీతాదేవి నేపాల్‌లో జన్మిస్తే.. 'ఆదిపురుష్'​లో మాత్రం భారత్‌లో పుట్టినట్టు చూపించారని మేకర్స్‌పై నేపాల్ నేతలు మండిపడుతున్నారు. ఆ సన్నివేశాన్ని తొలగించమని మేకర్స్ కు మూడురోజులు గడువు ఇచ్చినా ఇప్పటికీ తొలగించలేదని ఫైర్‌ అవుతున్నారు. దీంతో తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది నేపాల్ ప్రభుత్వం.