కాలాపానీ, లిపులేఖ్, లింపియధుర మావేనంటున్న నేపాల్

కాలాపానీ, లిపులేఖ్, లింపియధుర మావేనంటున్న నేపాల్
  • భారత్ నుంచి తిరిగి తీసుకుంటమంటూ నేపాల్ ప్రధాని కేపీ శర్మ కామెంట్స్

ఖఠ్మాండు : నేపాల్ ప్రధాని కేపీ శర్మ భారత్ లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర మావే అంటూ కామెంట్ చేశారు. వీటిని భారత్ నుంచి తిరిగి తీసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. కొన్ని రోజులుగా ఈ మూడు ప్రాంతాల విషయంలో నేపాల్ కిరికిరి స్టార్ట్ చేసింది. చైనా అండదండలతోనే నేపాల్ ఇదంతా చేస్తున్నట్లు భారత్ భావిస్తోంది. ఈ మూడు ప్రాంతాలను నేపాల్ భుభాగంలో ఉన్నట్లుగా చూపించే మ్యాప్ కు కూడా నేపాల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓపీ పార్లమెంట్ లో మాట్లాడారు. తమ భూభాగాలను భారత్ వివాదస్పదంగా మార్చిందంటూ విమర్శించారు. ” నేపాల్ కు చెందిన మూడు ప్రాంతాలను భారత్ వివాదస్పదంగా మార్చింది. అక్కడ భారత సైన్యాన్ని మెహరించింది. కానీ ఆ ప్రాంతాలు నేపాల్ కు చెందినవి. వాటిని తిరిగిపొందుతాం” అంటూ కామెంట్ చేశారు. ఉలిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను అప్పగించాలంటూ భారత్ ను డిమాండ్ చేయాలని నేపాల్ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఉత్తరాఖండ్‌లోని ధర్చులా ప్రాంతాన్ని లిపులేఖ్‌ తో కలుపుతూ భారత్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసింది. దీనిపై నేపాల్ అభ్యంతరం తెలిపింది. ఐతే చైనా సహకారంతోనే కేపీ శర్మ సర్కార్ భారత్ తో వివాదానికి దిగుతున్నట్లు మన దేశం అనుమానిస్తోంది. కేపీ శర్మ ఓలీ కి చైనా ఫుల్ సపోర్ట్ గా ఉంది. చైనా అవసరాలకు అనుగుణంగా ఆ దేశాన్ని వాడుకునేందుకు ఇండియాతో కయ్యం పెట్టిస్తుందని తెలుస్తోంది. డ్రాగన్ కంట్రీ మాత్రం ఈ వివాదాన్ని చర్చ ద్వారా పరిష్కరించుకోవాలంటూ సూచించింది.