కందనూలు, వెలుగు: రైతుల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా మండలానికి చెందిన అర్హులైన రైతులకు స్ప్రింక్లర్ పైపుల పంపిణీ చేశారు.
తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించేందుకు స్ప్రింక్లర్ విధానం ఉపయోగకరమని ఆయన తెలిపారు. అనంతరం బిజినేపల్లి మండలం సరకల్ పేటలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు.
