ఇంజమామ్ వారసుడు దొరికాడు: పాక్ బ్యాటర్ సిల్లీ రనౌట్.. నెటిజెన్స్ ట్రోల్స్

ఇంజమామ్ వారసుడు దొరికాడు: పాక్ బ్యాటర్ సిల్లీ రనౌట్.. నెటిజెన్స్ ట్రోల్స్

పాక్ దిగ్గజ బ్యాటర్లలో ఒకరైన ఇంజమామ్ ఉల్ హక్​ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాటర్ గా ఎంత గొప్పగాడో.. వికెట్ల మధ్య పరుగులు తీయడంలో అంత బద్ధకస్తుడు. అందువల్లే ఎక్కువగా ఫోర్లు కొట్టడం మీదే దృష్టి సారించేవాడు. ఇతర బ్యాటర్ల​తో పోటీపడి పరిగెత్తలేకపోవడం ఒక ఎత్తైతే.. బద్దకం కారణంగా ఔటైన సందర్భాలు మరికొన్ని. తాజాగా నేపాల్ తో జరుగుతోన్న మ్యాచ్ లో పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్.. తన రనౌట్ తో ఆ దిగ్గజ క్రికెటర్ ను గుర్తుచేశాడు. 

25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పాక్ ను బాబర్ ఆజాం(42 నాటౌట్), మహ్మద్ రిజ్వాన్(44) జోడి కాసేపు ఆదుకున్నారు. ఏకంగా మూడో వికెట్ కు 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారీ స్కోర్ దిశగా నడిపించారు. అయితే ఇన్నింగ్స్ 24 ఓవర్ లో రిజ్వాన్.. బద్దకం ఆ జట్టును మరోసారి కష్టాల్లో పడేసింది. సందీప్ లామిచానే వేసిన 24 ఓవర్ లో నాలుగో బంతిని పాయింట్ దిశగా ఆడిన రిజ్వాన్.. సింగిల్ కోసం పరుగెత్తాడు. అయితే అనుకున్న సమయానికి నాన్ స్ట్రైక్ ఎండ్ వైపు చేరినా.. తన వైపు వస్తున్న బంతిని చూస్తూ క్రీజులో బ్యాట్ పెట్టకుండా లేజీగా వ్యవహరించాడు. దీంతో సిల్లీగా రనౌట్ అయ్యాడు.

జస్ట్ పాకిస్తాన్ థింగ్స్

మహ్మద్ రిజ్వాన్ సిల్లీ రనౌట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంజమామ్ ఉల్ హక్​ వారసుడివి నువ్వే అంటూ నెటిజన్స్ అతన్ని ట్రోల్ చేస్తున్నారు.