ఖాట్మండు : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్‌కు చెందిన 53 ఏండ్ల షెర్పా కామి రీటా 27వ సారి అధిరోహించాడు. 2022లో 26వ సారి ఎవరెస్ట్ ను అధిరోహిం చిన ఆయన..బుధవారం ఉదయం 8:30 గంటలకు మరోసారి 8,848.86 మీటర్ల ఎత్తున్న శిఖరం పైకి చేరుకున్నాడు. దీంతో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కువసార్లు అధిరోహించిన వ్యక్తిగా తన పేరిట ఉన్న రికార్డును కామి రీటా నిలబెట్టుకు న్నారు. కమీ రీటా 1994లో మొదటి సారి ఎవరెస్ట్‌ను ఎక్కాడు. తర్వాత నేపాల్ తోపాటు వివిధ దేశాల్లోని 8 వేల మీటర్లకు పైగా ఉన్న అనేక పర్వతాలను అధిరో హించాడు. మూడు రోజుల కిందట పసాంగ్ దావా షెర్పా(46) ఎవరెస్ట్ శిఖరాన్ని 26వ సారి అధిరోహించిన విషయం తెలిసిందే.
