జనగామ, వెలుగు: జనగామలోని ఎనిమిది హోటల్స్పై సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ హోటల్లో ఎముకలు కరిగించిన నూనె వాడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ హోటల్‌తో పాటు మరో హోటల్‌ను సీజ్ చేశారు. జిల్లా కేంద్రమైన జనగామలోని పలు హోటల్స్ అపరిశుభ్రమైన వాతావరణంలో నడిపిస్తున్నారని, కాలం తీరిన పదార్థాలు ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి.
దీంతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వినిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో 15 మంది బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో 8 హోటల్స్పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక హోటల్లో ఎముకలు కరిగించిన నూనె వాడుతున్న విషయాన్ని గమనించారు.
నూనెను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ హోటల్‌ను సీజ్ చేశారు. పూర్తిగా అపరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహిస్తున్న మరో హోటల్‌ను సీజ్ చేశారు. మిగిలిన ఆరు హోటల్స్లో క్లీనింగ్ లేకపోవడం, కాలం తీరిన ఫుడ్ ఐటమ్స్‌తో పాటు కారం పొడి, పెరుగు, వాటర్ బాటిల్స్‌ను సీజ్ చేశారు.
మూడు హోటల్స్‌కు రూ.20 వేలు చొప్పున, మరో ఐదు హోటల్స్‌కు రూ.10 వేల చొప్పున ఫైన్ విధించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను ల్యాబ్‌కు పంపించారు.
