Amaran: భారీ ధరకు అమ్ముడైన అమరన్ OTT రైట్స్.. వివాదమే కలిసొచ్చిందా!

Amaran: భారీ ధరకు అమ్ముడైన అమరన్ OTT రైట్స్.. వివాదమే కలిసొచ్చిందా!

తమిళ స్టార్ శివ కార్తికేయన్(Shiva Karthikeyan) హీరోగా వస్తన్న లేటెస్ట్ మూవీ అమరన్(Amaran). మేజర్ ముకుంద్ వరదరాజన్(Mukund Varadharajan) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి(Rajkumar Periyaswami) తెరకెక్కిస్తున్నాడు. లోకనాయకుడు కమల్ హాసన్(Kalam Haasan) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన టీజర్ ఆడియన్స్ పై అంచనాలు పెంచేసింది. 

అయితే టీజర్ విషయంలో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఈ టీజర్ లో వివాదాస్పదమైన సన్నివేశాలు ఉన్నాయని, తక్షణమే అమరన్ సినిమాను నిలిపివేయాలని తమిళనాడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేసారు. మూవీ టీజర్‌లో కాశ్మిరీలు, అక్కడి ముస్లింలను ఉగ్రవాదులుగా మార్చినట్లు చూపించారని, కలిసి మెలసి ఉండే హిందువులు, ముస్లింల మధ్య విభేదాలను సృష్టించేలా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయంటూ వారు తెలిపారు. ప్రస్తుతం ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. 

ఇదిలా ఉంటే..తాజాగా ఈ సినిమాకు ఓటీటీలో అదిరిపోయే డీల్ కుదిరిందట. అమరన్ సినిమా ఓటీటీ హక్కుల కోసం నెట్ఫ్లిక్, అమెజాన్ ప్రైమ్ పోటీపడగా అదిరిపోయే రేట్ కు నెట్ఫ్లిక్ అమరన్ హక్కులను సొంతం చేసుకుందట. ఈ సినిమా కోసం నెట్ఫ్లిక్ ఏకంగా రూ.55 కోట్లు ఖర్చు చేసిందని సమాచారం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. అటు శివ కార్తికేయ, ఇటు సాయి పల్లవి కెరీర్ లో ఇదే హైయెస్ట్ అమౌంట్. అయితే.. ఈ సినిమాకు ఈ రేంజ్ రేట్ రావడానికి కారణం ఈ వివాదమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వివాదం వచ్చింది కాబట్టి ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారని నెట్ఫ్లిక్ ప్లాన్. మరి నిజంగా ఈ సినిమాకు ఆ రేంజ్ ఇంట్రెస్ట్ వస్తుందా అనేది చూడాలి.