Nivetha Pethuraj: మీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు.. యూట్యూబర్పై నివేతా ఫైర్

Nivetha Pethuraj: మీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు.. యూట్యూబర్పై నివేతా ఫైర్

సోషల్ మీడియాలో స్టార్స్ పై రూమర్స్ రావడం ఎక్కువైపోయింది. తమ ఫేమ్ కోసం ఎవరికీ నచ్చిన వార్తలు వారు వైరల్ చేస్తున్నారు. కొంత మండితే చనిపోని వారిని కూడా చనిపోయారని చెప్తూ న్యూస్ వైరల్ చేస్తున్నారు. చివరికి వారే మీడియా ముందుకు వచ్చి నేను బతికే ఉన్నాను అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇలా చాలా సంఘటనలు జరిగినా.. ఇలాంటి వార్తలు రాయడం మాత్రం మానడం లేదు కొంతమంది. 

తాజాగా ఇలాంటి సంఘటనే హీరోయిన్ నివేతా పెతురాజ్(Nivetha Pethuraj) కు ఎదురయింది. ఆమెపై లేనిపోని కల్పించి రాయడంతో సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు నివేతా. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తమిళనాడుకు చెందిన ఓ యూట్యూబ్ ఛానెల్ నివేత, ఉదయనిధి స్టాలిన్ గురించి ఓ వార్త టెలికాస్ట్ చేసింది. స్టాలిన్ నివేదా పేతురాజుకు ప్రేమ కానుకగా రూ.50 కోట్ల ఇల్లు కొనిచ్చాడు అంటూ ఆ ఛానెల్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్తా తెగ వైరల్ అయ్యింది. 

దాంతో ఆ వీడియోపై ఘాటుగా స్పందించారు నివేతా. నేను సినిమా అవకాశాల కోసం కూడా ఎవరినీ అడగలేదు. నా 16 ఏళ్ళ వయసు నుండి ఫైనాన్షియల్ విషయంలో ఇండిపెండెంట్ గానే ఉన్నాను. ఎవరినీ ఏది అడిగే మనస్తత్వం కాదు నాది. మాది చాలా సాధారణ కుటుంబం. 20 ఏళ్ళ నుండి దుబాయ్ లోనే ఉంటున్నాం. మా బతుకేదో మేము బతుకుతుంటే.. ఇటువంటి రాతలు రాసి మా కుటుంబాన్ని నవ్వులపాలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇది జర్నలిజం కాదు. ఏదైనా ఉంటే తెలుసుకొని రాయండి. మీ కుటుంబాలలో కూడా స్త్రీలు ఉన్నారు. అలాగే నన్ను భావించండి. ఈ విషయంపై కోర్టులకెక్కదలుచుకోలేదు. ఎందుకంటే.. మీలో  మానవత్వం అనేది ఉందని, ఉంటుందనే నమ్ముతున్నాను. అంటూ తన భాదను చెప్పుకొచ్చారు నివేతా పేతురాజ్. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.