Rajamouli: కలలు కనడం.. కష్టపడటం.. గామి మేకర్స్పై రాజమౌళి ప్రశంసలు

Rajamouli: కలలు కనడం.. కష్టపడటం.. గామి మేకర్స్పై రాజమౌళి ప్రశంసలు

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ గామి(Gaami). కొత్త దర్శకుడు విశ్వధర్(Vishwadhar) తెరకెక్కించిన ఈ ప్రత్యేకమైన సినిమా శివరాత్రి కానుకగా మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. కారణం.. ఈ సినిమా మేకింగ్. దాదాపు 6 సంవత్సరాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే దాదాపు నాలుగు సంవత్సరాలు తీసుకున్నారంటే మాములు విషయం కాదు. ఇక ఈ సినిమాలో విశ్వక్ అఘోరాగా కనిపించడం మరో విశేషం. 

మనిషి స్పర్శ తాకితే చనిపోయే వింత వ్యాధితో బాధపడే వ్యక్తిగా కనిపించారు విశ్వక్. ఇక సినిమాను కూడా మేకర్స్ చాలా గ్రాండియర్ గా తెరకెక్కించారు. ట్రైలర్ లో విజువల్స్ చూస్తుంటే నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగలేదు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ సినిమా. ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించాడని దాదాపు ఆర్ సంవత్సరాలుగా ఈ సినిమా కోసం కష్టపడ్డారు మేకర్స్. 

తాజాగా గామి సినిమా మేకర్స్ పై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాపై తన ఇన్స్టాలో స్టోరీ పెట్టారు. అసాధ్యమైన కలలు కనడం.. వాటిని నిజం చేయడానికి కష్టపడటం. గామి సినిమా కోసం ప్రేక్షకులను ఆకట్టుకునే విజువల్స్ సాధించడంలో నిర్మాత కార్తీక్, దర్శకుడు విద్యాధర్ సూపర్ సక్సెస్ అయ్యారు. దాదాపు నాలుగేళ్లుగా ఈ సినిమా కోసం వారు కష్టపడ్డారు. నన్ను కలిసి ఈ సినిమా కోసం వారు చేసిన కృషి గురించి చెప్తున్నప్పుడు నాకదే అనిపించింది. గామి మేకర్స్ కు నా శుభాకాంక్షలు.. అని రాసుకొచ్చారు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న గామి సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకోనుందో చూడాలి.