Netflix Subscribers: నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రైబర్స్ ఎంతో తెలిస్తే..షాక్ అవ్వాల్సిందే

Netflix Subscribers: నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రైబర్స్ ఎంతో తెలిస్తే..షాక్ అవ్వాల్సిందే

ప్రస్తుతం ఇండియాలో ఓటీటీ కంటెంట్‌కి భారీ డిమాండ్ పెరిగింది. థియేటర్స్ దొరకని చిన్న సినిమాలకు బాసటగా నిలుస్తూనే..థియేటర్స్లో రిలీజైన సినిమాలకు కూడా తిరిగి రిలీజ్ అయ్యే ప్లాట్ ఫామ్ లా ఉంది. ఓ మూడు సంవత్సరాల ముందువరకు కూడా హాలీవుడ్ లో మాత్రమే ఓటీటీ మూవీస్నీ ఎక్కువ చూసేవారు. కానీ, ఇప్పుడు తెలుగు ఆడియన్స్కు ఓ డిజిటల్ మిని థియేటర్గా నిలిచింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ ఉన్నప్పటికీ..నెట్‌ ఫ్లిక్స్ (Netflix) కు మాత్రం  అత్యధిక సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అంతెందుకు..నెట్‌ఫ్లిక్స్ తర్వాతే మిగతా ఓటీటీస్ అన్నట్లుగా ఉంది. దీనికి కారణం లేకపోలేదు..నెట్‌ఫ్లిక్స్ ఎంచుకునే సినిమాల కంటెంట్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రస్తుతం..నెట్‌ఫ్లిక్స్ లో సినిమా వస్తుందంటే..ఆ సినిమాలో ఏదో బలమైన సందేశం ఐనా..ఎవ్వరికీ తెలియని ఇన్ఫర్మేషన్ ఐనా ఉండేలా స్ట్రాంగ్ బెస్ మెంట్ ఏర్పాటు చేసుకుంది. 

2023 మిడిల్ ఇయర్ లో ఉన్నప్పుడు నెట్‌ఫ్లిక్స్ కి 240 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఉన్నట్టు ప్రకటించింది. ప్రసెంట్ 2023 లెక్కల ప్రకారం..నెట్‌ ఫ్లిక్స్ కు వరల్డ్ వైడ్ గా 260 మిలియన్ల సబ్‌ స్క్రైబర్స్ ఉన్నట్లుగా మీడియా సంస్థలు వెల్లడించాయి.

గడిచిన మూడు నెలల్లోనే 13 మిలియన్స్ సబ్ స్క్రైబర్స్ పెరిగినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అంటే ప్రస్తుతం 26 కోట్ల మంది ప్రపంచంలో నెట్‌ ఫ్లిక్స్ అకౌంట్ కలిగి ఉన్నారంటే..అర్ధం చేసుకోండి. ఇంత భారీ మొత్తంలో ఇండియాలోనే మరే ఓటీటీ కి కూడా సబ్‌స్క్రైబర్స్ లేరనేది కన్ఫర్మ్‌. ప్రస్తుతం 2023 నాటికి ఇండియాలో 10 మిలియన్ల పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు

ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లోని సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. దీంతో మరికొన్ని రోజుల్లో నెట్ఫ్లిక్స్కు సబ్‌స్క్రైబర్స్ పెరిగే ఛాన్స్ ఉంది. 2024 లో మోస్ట్ అవైటెడ్ మూవీలైన జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్-1, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 మూవీస్ నెట్ఫ్లిక్స్ లో రానున్నాయి.