T20 World Cup 2024: బంగ్లాదేశ్ తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్

T20 World Cup 2024: బంగ్లాదేశ్ తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్

వరల్డ్ కప్ లో భాగంగా మరో కీలక మ్యాచ్ నేడు జరగనుంది. బంగ్లాదేశ్ తో నెదర్లాండ్స్ అమీ తుమీ తేల్చుకోనుంది. అర్నోస్ వేల్ గ్రౌండ్,  కింగ్‌స్టౌన్ లోని సెయింట్ విన్సెంట్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండు జట్లు కూడా ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఒక విజయాన్ని సాధించాయి. గ్రూప్ డి లో భాగంగా ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సూపర్ 8 బెర్త్ దాదాపుగా చేరుకుంటుంది. ఇప్పటికే ఈ గ్రూప్ లో దక్షిణాఫ్రికా సూపర్ 8 కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

నెదర్లాండ్స్ ప్లేయింగ్ 11: 

మైకేల్ లెవిట్, మాక్స్ ఓడౌడ్, విక్రమ్‌జిత్ సింగ్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్, వికెట్ కీపర్), బాస్ డి లీడే, లోగాన్ వాన్ బీక్, టిమ్ ప్రింగిల్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్, వివియన్ కింగ్మా

బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11:

తాంజిద్ హసన్, నజ్ముల్ హొసైన్ శాంటో (కెప్టెన్), లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్.