నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రట్ రాజీనామా

నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రట్ రాజీనామా

నెదర్‌లాండ్స్‌ ప్రధాని మార్క్ రట్ తన పదవికి రాజీనామా చేశారు.  దీంతో నాలుగు పార్టీల కూటమితో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. దేశంలోకి వలసల నిరోధంపై  కూటమిలోని నాలుగు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రధాని మార్క్‌ రట్‌ తప్పుకున్నారు. తనతో పాటుగా మంత్రి మండలి కూడా రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.  తన రాజీనామా లేఖను నెదర్‌లాండ్స్‌ రాజు విల్లెమ్ అలెక్సాండర్‌కు అందజేశారు.  అధికారం చేపట్టిన ఏడాదికే సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడం గమనార్హం. 

దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా మార్క్‌ రట్‌ నిలిచారు. 2010లో ఆయన తొలిసారిగా ప్రధాని బాధ్యతలు చేపట్టారు. 2022 జనవరిలో ఆయన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టింది. కాగా, రట్‌ రాజీనామాతో పార్లమెంటులోని దిగువసభలో ఉన్న 150 సీట్లకు ఈ ఏడాది చివర్లో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కొత్త కూటమిని ఎన్నుకునే వరకు రట్టే, అతని ప్రభుత్వం కేర్ టేకర్ హోదాలో పదవిలో కొనసాగుతారు.