టీ20 వరల్డ్ కప్ 2022 నుంచి సౌతాఫ్రికా ఔట్

టీ20 వరల్డ్ కప్ 2022 నుంచి సౌతాఫ్రికా ఔట్

టీ20 వరల్డ్ కప్ 2022లో మరో సంచలనం నమోదైంది. పసికూన నెదర్లాండ్స్ సౌతాఫ్రికాకు షాకిచ్చింది. సెమీస్ చేరుతుందని భావించిన సౌతాఫ్రికా ..నెదర్లాండ్స్ చేతిలో ఓడి ముఖం పట్టింది. సెమీస్ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో సౌతాఫ్రికా 13 పరుగుల తేడాతో ఓడింది. దీంతో టీ20 వరల్డ్ కప్ గ్రూప్ 2 నుంచి భారత్ సెమీస్ చేరింది. 

రాణించిన నెదర్లాండ్స్
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన  నెదర్లాండ్స్ కు ఓపెనర్లు మై బర్గ్, ఓ డౌడ్లు మంచి శుభారంభం అందించారు. ముఖ్యంగా మై బర్గ్ సౌతాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరు ఫస్ట్ వికెట్కు 58 పరుగులు జోడించారు. మై బర్గ్ ఔట్ తర్వాత వచ్చిన  కూపర్ వచ్చి రాగానే సౌతాఫ్రికా బౌలర్లను ఉతికారేశాడు. దీంతో నెదర్లాండ్స్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే 97 పరుగుల వద్ద  ఓ డౌడ్, 112 పరుగుల వద్ద కూపర్,  123 పరుగుల వద్ద బాస్ డీ లీడ్  పెవిలియన్ కు చేరారు. ఫలితంగా నెదర్లాండ్స్ స్కోరు బోర్డు వేగం తగ్గింది. చివర్లో అకర్ మన్ చెలరేగాడు. చివరి రెండు ఓవర్లలో 31 పరుగులు రావడంతో...నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది.  సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2 వికెట్లు తీశాడు.

https://twitter.com/ICC/status/1589096084315463681
సౌతాఫ్రికాకు షాక్..
159 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన  సౌతాఫ్రికాను నెదర్లాండ్స్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. క్వింటన్ డికాక్ , కెప్టెన్ బవుమా , మార్కరమ్ ,  క్లాసెన్ , మిల్లర్ దారుణంగా విఫలమయ్యారు. వరల్డ్ క్లాస్ ప్లేయర్లుగా చెప్పుకునే వీరు..పసికూనగా చెప్పుకునే నెదర్లాండ్స్ బౌలర్లను ఎదుర్కొలేకపోయారు. చివర్లో  కేశవ్ మహరాజ్ కొద్దిగా పోరాడినా జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా ఓడిపోవడంతో...గ్రూప్ 2 నుంచి భారత్ సెమీస్ చేరింది. గ్రూప్ 2 నుంచి పాకిస్తాన్ సెమీస్ లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్ పై గెలవడంతో పాక్ సెమీస్ చేరుకుంది.