సెయిలింగ్‌లో నేత్ర కుమనన్ నాలుగో ప్రయత్నంలో ఏషియాడ్‌లో కాంస్యాన్ని గెలుచుకుంది. శుక్రవారం జరిగిన డింగీ విభాగంలో ఆమె 14 (ఫైనల్‌లో 7, క్వాలిఫికేషన్ రేసుల్లో 7) పాయింట్లు సాధించి మూడో ప్లేస్‌లో నిలిచింది.
థాయ్‌లాండ్‌కు చెందిన సోఫియా మోంట్‌గోమేరి (5 పాయింట్లు), సింగపూర్ సెయిలర్ జానియా ఆంగ్ (13 పాయింట్లు) వరుసగా స్వర్ణం, రజతం నెగ్గారు. సెయిలింగ్‌లో పాయింట్లు ప్రతి రేసులో ముగింపు స్థానం (ఫినిషింగ్ పొజిషన్) ఆధారంగా నిర్ణయిస్తారు.
