
బాలీవుడ్లో అత్యధికంగా ట్రోలింగ్‌కు గురయ్యే హీరోయిన్ ఎవరంటే టక్కున సారా అలీఖాన్ పేరు చెప్తారు. తన మొదటి సినిమా నుంచే ఈ నటి తన యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ‘లవ్ ఆజ్ కల్ 2’ సినిమాలో ఓ ఎమోషనల్ సీన్లో నటించగా దాన్ని కూడా నెటిజన్లు మీమ్ కంటెంట్‌గా మార్చేశారు. తాజాగా సారా మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఓ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా హీరో సిద్ధార్థ రాయ్ కపూర్‌తో కలిసి ఈ భామ ర్యాంప్ వాక్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన్ ఎక్స్ప్రెషన్స్ వైరల్‌గా మారాయి. మరీ ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? అంటూ ఈ హీరోయిన్ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. నీ మొహంలో ఫేక్నెస్ ఉట్టిపడుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్ వారసురాలిగా సినీ ఎంట్రీ ఇచ్చిన సారా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది.