డాడీ కాబోతున్న కోహ్లికి నెటిజన్ల టిప్స్

డాడీ కాబోతున్న కోహ్లికి నెటిజన్ల టిప్స్

మంచి డాడ్‌‌గా ఉండటం అంత ఈజీ కాదు. విరాట్‌‌ కోహ్లీ ఇంకా కొన్ని రోజుల్లో నాన్న కాబోతున్నాడు కదా! సో,  ‘డాడ్‌‌ టు బి విరాట్‌‌ కోహ్లి’ అనే సరదా కాన్సెప్ట్ మీద సోషల్‌‌ మీడియాలో కొంతమంది నాన్నలు టిప్స్‌‌ షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ముంబైలో ఉండే బ్రిజేశ్ పిల్లై అనే నెటిజన్ షేర్ చేసిన టిప్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 

‘బిడ్డను పెంచడంలో తల్లితో పాటు తండ్రి కూడా సమాన బాధ్యత తీసుకోవాలని నమ్ముతాను. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే పేరెంట్స్ అవసరం ఉంటుందని చాలామంది నమ్ముతుంటారు.  కానీ, నిజం ఏంటంటే… పిల్లలు జీవితాంతం పేరెంట్స్‌‌  ప్రేమను, సపోర్ట్‌‌ని కోరుకుంటారు. కొంచెం పెద్దయ్యాక నాన్న ఒక ఫ్రెండ్‌‌లాగా ఉండాలనుకుంటారు. పెద్దవాళ్లు ఏం చేస్తే  పిల్లలు  దాన్నే అనుసరిస్తారని, తండ్రి అయ్యాకే రియలైజ్ అవుతాం! కాబట్టి,  ఎప్పుడూ ఏదో ఒకటి టీచ్ చేయనవసరం లేదు. ఎందుకంటే వాళ్లు తండ్రిని కాపీ కొడతారు. పిల్లల్లో మెజారిటీ నాన్ననే రోల్‌‌మోడల్‌‌గా భావిస్తారు.

నువ్వు కంపెనీకి సీఈవోవా? క్లర్క్‌‌వా? అనేది వాళ్లకు అనవసరం!  ఏ పొజిషన్‌‌లో ఉన్నా సరే.. తన తండ్రిలో హీరోనే చూసుకుంటాడు.  కాబట్టి, ఈ ప్రపంచంలో ఉన్న  ప్రతి జాబ్‌‌ని, వయసు, జెండర్, ప్రొఫెషన్‌‌తో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తిని గౌరవించడం నేర్పించాలి.  మీ పిల్లలు చిన్నవాళ్లు కావొచ్చు. కానీ,  వాళ్లు చూసిన దానిమీద, చేసిన పని మీద సొంత అభిప్రాయాలు ఏర్పరుచుకుంటారు.

మీ చుట్టుపక్కన పిల్లలు ఉంటే.. కచ్చితంగా ఎమోషన్స్‌‌ని, కోపాన్ని మేనేజ్ చేసుకోవాలి. అలాగే, పిల్లల మీద అరవకూడదు. వాళ్లను ఎమోషనల్‌‌గా డీల్ చేయాలి. తండ్రి ఇలాగే ఉండాలని ఎవరూ చెప్పరు. ఇది లెర్నింగ్‌‌ ప్రాసెస్‌‌. టైమ్‌‌ టు టైమ్ అర్థం చేసుకుని పెంచడమే ఎవరైనా చేయగలిగింది. మన తల్లిదండ్రులు మనల్ని పెంచడానికి పేరెంటింగ్ క్లాసెస్‌‌కి వెళ్లారా? అయినా వాళ్ల పేరెంటింగ్‌‌  స్కిల్స్‌‌ని చాలెంజ్ చేయలేం.  చివరికి ఒక్కటి గుర్తుంచుకోండి…  ప్రతి పిల్లాడి లాగే,  ప్రతి పేరెంట్‌‌  యూనిక్!’ అని ముగించాడు బ్రిజేశ్‌‌.

for more News…

హైదరాబాద్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

ఆ ఊరిలో అమ్మాయి పుడితే 5వేలు డిపాజిట్.. పెద్దయ్యాక ఊరోళ్లే పెళ్లి కూడా చేేస్తారు

చిన్న పట్టణాల్లో ఉద్యోగాలిస్తాం-బీపీఓ కంపెనీలు

గుడ్లు ఫ్రిజ్​లో స్టోర్​ చేస్తే డేంజర్