నీ కెరీర్ ఖతం.. నువ్వు ఇంటర్నేషనల్ క్రికెట్‎కు పనికి రావ్: కరుణ్ నాయర్‎పై సోషల్ మీడియాలో ట్రోలింగ్

నీ కెరీర్ ఖతం.. నువ్వు ఇంటర్నేషనల్ క్రికెట్‎కు పనికి రావ్: కరుణ్ నాయర్‎పై సోషల్ మీడియాలో ట్రోలింగ్

బ్రిటన్: మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‎తో జరుగుతోన్న నాలుగు టెస్టులో టీమిండియా సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్‎పై వేటు పడింది. అంచనాల మేర రాణించకపోవడంతో కరుణ్ నాయర్‎ను పక్కకు పెట్టిన టీమ్ మేనేజ్మెంట్.. అతడి స్థానంలో యువ ప్లేయర్ సాయి సుదర్శన్‎ను జట్టులోకి తీసుకుంది. కరుణ్ నాయర్‎ను జట్టు నుంచి తప్పించడంపై నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు కరుణ్ నాయర్‎కు సపోర్టు చేస్తుండగా.. మరికొందరు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. 

కరుణ్ నాయర్ వెరీ టాలెంటెడ్ ప్లేయర్. టెస్టుల్లో టీమిండియా తరుఫున ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‎మెన్. దేశ వాళీ క్రికెట్‎లో అయితే టన్నుల కొద్ది పరుగులు. అన్ని ఉన్నా అల్లుడి నోట్ల శని ఉన్నట్లు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‎లో వేల కొద్ది పరుగులు చేసిన టీమిండియాలో మాత్రం అతడి చోటు దక్కకపోయేది. దీంతో సగటు క్రికెట్ అభిమాని.. బీసీసీఐ కరుణ్ నాయర్‎కు అన్యాయం చేస్తోందని విమర్శించే వారు. 2025 దేశవాళీ లీగులు, ఐపీఎల్ తర్వాత బీసీసీఐపై ఈ విమర్శలు మరింత ఎక్కువ అయ్యాయి. 

ఎందుకంటే ఫస్ట క్లాస్ క్రికెట్లో నాయర్ పరుగుల వరద పారించాడు. అలాగే ఐపీఎల్‎లో ఢిల్లీ తరుఫున బాగానే రాణించాడు. ఇదే సమయంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో జట్టులో ఎక్కువ ఎక్స్‎పీరియన్స్ ఉన్న ఆటగాళ్లు లేకుండా అయిపోంది. కీలకమైన ఇంగ్లాండ్ సిరీస్‎కు మొత్తం యువ జట్టే కాకుండా కొందరు అనుభవజ్ఞులను కూడా పంపించాలని బీసీసీఐ భావించింది. ఈ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఇంగ్లాండ్ సిరీస్‎కు కరుణ్ నాయర్‎ను బీసీసీఐ సెలెక్ట్ చేసింది. 

►ALSO READ | Sarfaraz Khan: 2016లో RCB నన్ను జట్టు నుంచి తప్పించింది.. కోహ్లీ మాటల కారణంగానే సన్నగా అయ్యాను

చాలా ఏండ్ల తర్వాత జట్టు నుంచి పిలుపు రావడంతో ఉత్సాహంగా ఇంగ్లాండ్ వెళ్లిన కరుణ నాయర్.. ఇంగ్లీష్ ఏ టీమ్‎తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచుల్లో మరోసారి ట్రిపుల్ సెంచరీ సాధించి.. జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. కానీ జట్టులోకి వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. దేశవాళీ లీగులు, ఐపీఎల్, ప్రాక్టీస్ మ్యాచుల్లో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్.. ఇంగ్లాండ్ పై అంచనాల మేరకు రాణించలేదు. వరుసగా మ్యాడు మ్యాచుల్లో తక్కువ సోర్లకే ఔట్ అయ్యి తన స్థాయి ఆట ప్రదర్శించడంలో నాయర్ విఫలం అయ్యాడు.

మూడు టెస్టుల్లో కలిపి 131 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపర్చాడు. చాలా ఏండ్ల తర్వాత వచ్చినా సువర్ణావకాశాన్ని అందిపుచ్చకోలేకపోయాడు. దీంతో నాలుగో టెస్టులో అతడిపై వేటు వేసింది జట్టు మేనేజ్మెంట్. ఈ క్రమంలో కరుణ్ నాయర్ను జట్టు నుంచి తప్పించడంపై కొందరు నెటిజన్లు సమర్ధిస్తున్నారు. 

నాయర్ టెస్ట్ కెరీర్ ముగిసిందని.. వచ్చిన మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడని కొందరు, నాయర్ ఓన్లీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అని.. అతడు ఇంటర్నేషనల్ క్రికెట్‎కు పనికి రాడని మరికొందరు, కరుణ్ నాయర్ ను జట్టు నుంచి తప్పిస్తూ గిల్, గంభీర్ తీసుకున్న నిర్ణయం కరెక్టేనని.. ఇంకో అవకాశానికి సాయి సుదర్శన్ అర్హుడని ఇంకొందరు, క్రికెట్ కరుణ్‌కి మరో అవకాశం ఇచ్చింది కానీ అతడు దానిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.