Sarfaraz Khan: 2016లో RCB నన్ను జట్టు నుంచి తప్పించింది.. కోహ్లీ మాటల కారణంగానే సన్నగా అయ్యాను

Sarfaraz Khan: 2016లో RCB నన్ను జట్టు నుంచి తప్పించింది.. కోహ్లీ మాటల కారణంగానే సన్నగా అయ్యాను

టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్​ అధిక బరువు కారణంగా కెరీర్ ప్రారంభం నుంచే ఫిట్​నెస్ తో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సూపర్ ఫామ్ లో ఉన్నా.. లావుగా ఉండడంతో ట్రోలింగ్​కు గురయ్యాడు. దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నప్పటికీ ఫిట్ నెస్ కారణంగా భారత జట్టులో కూడా సెలక్ట్ అవ్వలేకపోయాడు. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లోనూ ఈ ముంబై బ్యాటర్ కు నిరాశే మిగిలింది. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లోనూ సర్ఫరాజ్ ను సెలక్టర్లు పట్టించుకోలేదు. దీంతో సర్ఫరాజ్ ఫిట్ నెస్ పై ఫోకస్ చేశాడు. 

కఠిన డైట్ చేస్తూ కేవలం రెండు నెలల్లోనే 17 కిలోల శరీర బరువు తగ్గి స్లిమ్ అండ్ ట్రిమ్ లుక్ తో కనిపించి ఆశ్చర్యానికి గురి చేశాడు. సోషల్ మీడియాలో షేర్ చేసిన చిత్రంలో సన్నగా కనిపిస్తూ వైరల్ గా మారుతున్నాడు. రంజీ ట్రోఫీకి నెలకు ముందు సర్ఫరాజ్ ఈ లుక్ లో కనిపించి హాట్ టాపిక్ గా మారాడు. రెండు నెలల క్రితం ఇంగ్లాండ్ తో సిరీస్ కు ముందు 10 ఈ ముంబై బ్యాటర్ కఠినమైన డైట్ ప్లాన్ చేసి 10 కిలోల బరువు తగ్గాడు. తర్వాత రెండు నెలలో మరో 17 కేజీలు తగ్గడం విశేషం. అతను ఫిట్ గా ఉండటానికి ఉడికించిన కూరగాయలు తినడంతో పాటు చికెన్ పూర్తిగా మానేసి ఫిట్ నెస్ పై ఫోకస్ చేశాడు. తంలో వచ్చిన ఇంత డెడికేషన్ కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీనే కారణమని తెలిపాడు.     

సన్నగా మారిన తర్వాత మీడియాతో మాట్లాడిన సర్ఫరాజ్ తన ఫిట్ నెస్ పై కోహ్లీ ప్రభావం ఎలాటిందో చెప్పుకొచ్చాడు. సర్ఫరాజ్ మాట్లాడుతూ.. "నా ఫిట్‌నెస్ కారణంగా 2016లో నన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నుంచి తొలగించారు. నా నైపుణ్యాలపై ఎటువంటి సందేహాలు లేనప్పటికీ, నా ఫిట్‌నెస్ నన్ను తదుపరి స్థాయికి తీసుకెళ్లనివ్వడం లేదని విరాట్ కోహ్లీ అప్పుడే నాకు చెప్పాడు. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో కోహ్లీ నాతో నిర్మొహమాటంగా చెప్పాడు. ఒకప్పుడు నా టీమ్ మేట్స్ నన్ను పాండా అని పిలిచేవారు. ఎందుకంటే నేను చాలా ఎక్కువగా తినేవాడిని. ఇప్పుడు వారు నన్ను చూసి మాచో అని పిలుస్తున్నారు." అని సర్ఫరాజ్ చెప్పుకొచ్చాడు. 

►ALSO READ | మాంచెస్టర్‌లో 51 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. కాంట్రాక్టర్ రికార్డ్ తుడిచిపెట్టిన జైశ్వాల్

సర్ఫరాజ్ తన చివరి టెస్టును గత ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ XIతో ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సర్ఫరాజ్ ఎంపికైనా ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం రాలేదు. దీనికి తోడు గాయం కారణంగా 2024-25 రంజీ ట్రోఫీకి దూరమయ్యాడు. 2024 ఫిబ్రవరి 15 రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే రెండు ఇన్నింగ్స్ ల్లో హాఫ్ సెంచరీలు చేసి సత్తా చాటాడు. ఓవరాల్ గా ఆరు టెస్టుల్లో ఇండియా తరపున 371 పరుగులు చేశాడు.