మాంచెస్టర్‌లో 51 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. కాంట్రాక్టర్ రికార్డ్ తుడిచిపెట్టిన జైశ్వాల్

మాంచెస్టర్‌లో 51 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. కాంట్రాక్టర్ రికార్డ్ తుడిచిపెట్టిన జైశ్వాల్

బ్రిటన్: టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైశ్వాల్ మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. నాలుగో టెస్ట్ జరుగుతోన్న మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌ స్టేడియంలో 51 సంవత్సరాల తర్వాత హాఫ్ సెంచరీ చేసిన భారత ఓపెనర్‎గా నిలిచాడు. చివరగా ఓల్డ్ ట్రాఫోర్డ్‌ స్టేడియంలో 1959లో భారత ఓపెనర్ నారి కాంట్రాక్టర్ హాఫ్ సెంచరీ సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరే ఇతర భారత ఓపెనర్ కూడా ఓల్డ్ ట్రాఫోర్డ్‌‎లో  హాఫ్ సెంచరీ నమోదు చేయలేదు.

51 ఏళ్ల తర్వాత మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌ స్టేడియంలో జరుగుతోన్న నాలుగో టెస్టులో అర్ధసెంచరీ బాది..  నారి కాంట్రాక్టర్ 51 ఏళ్ల రికార్డును తుడిచిపెట్టాడు జైశ్వాల్. ఇదే కాకుండా ఈ మ్యాచులో మరో రికార్డ్ కూడా సాధించాడు జైశ్వాల్. ఇంగ్లాండ్‌లో 1000 టెస్ట్ రన్స్ కంప్లీట్ చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగవ భారత ఓపెనర్‏గా.. ఓవరాల్‎గా 20వ ఇండియన్ బ్యాటర్‎గా అరుదైన ఫీట్ నెలకొల్పాడు. 

►ALSO READ | IND vs ENG 2025: తడబడిన టీమిండియా.. రెండో సెషన్‌లో ఇంగ్లాండ్‌కు మూడు వికెట్లు

ఈ మ్యాచులో జైశ్వాల్ 58 పరుగులు చేసి డాసన్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. మరో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ తృటిలో ఈ రికార్డ్ మిస్ చేసుకున్నాడు. నాలుగో టెస్టులో యశస్వీ జైశ్వాల్‎తో  కలిసి ఇన్సింగ్స్ ఆరంభించిన కేఎల్ రాహుల్ 46 పరుగులు వద్ద ఔట్ అయ్యాడు. దీంతో 4 పరుగుల దూరంలో ఈ రికార్డ్ మిస్ అయ్యింది. 

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న టెస్ట్ ఫస్ట్ ఇన్సింగ్స్ ఫస్ట్ సెషన్లో ఆకట్టుకున్న టీమిండియా రెండో సెషన్‎లో తడబడింది. తొలి సెషన్‎లో ఒక్క వికెట్ కూడా కోల్పోని భారత్ రెండో సెషన్‎లో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. జైశ్వాల్ 58, రాహుల్ 46, కెప్టెన్ శుభమన్ గిల్ 12 పరుగులు చేసి ఔట్ అయ్యారు. తొలి రోజు టీ విరామ సమయానికి 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. క్రీజ్‎లో సాయి సుదర్శన్ (26), పంత్ (3) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్, స్టోక్స్, డాసన్ తలో వికెట్ తీసుకున్నారు.