
పాలతో చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసే న్యూడ్, తన హై-గ్లేజర్ లైన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నటి శ్రీలీలను నియమించింది. ఆమెకు ఉన్న ఆదరణ దక్షిణ భారత మార్కెట్లో తమ అమ్మకాలను పెంచడానికి ఉపయోగపడుతుందని వీటి తయారీ సంస్థ సౌత్‌బే టాలెంట్ తెలిపింది. న్యూడ్తో కలసి పనిచేయడంపై శ్రీలీల మాట్లాడుతూ తన చర్మ సంరక్షణ కోసం చిన్నప్పటి నుంచి పాలను వాడుతున్నానని చెప్పారు.
న్యూడ్ బ్రాండ్ పాలతో ప్రొడక్టులను తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు. సౌత్‌బే టాలెంట్ సీఈఓ ప్రశాంత్ పొట్లూరి మాట్లాడుతూ నటుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ద్వారా ఇందులో వ్యూహాత్మక పెట్టుబడి పెట్టారని వెల్లడించారు.