చనిపోయే ముందు యువతి ‘లవ్ యూ జిందగీ’ వైరల్ వీడియో

చనిపోయే ముందు యువతి ‘లవ్ యూ జిందగీ’ వైరల్ వీడియో

కరోనాతో రోజూ చాలామంది చనిపోతున్నారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ తాను బతుకుతానని నమ్మి, ఐసీయూ బెడ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉన్న శృతి అనే యువతి అనుకోకుండా మృతిచెందింది. ఈ ఘటన సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఆ వీడియోను బాధితురాలికి వైద్యం చేసిన డా. మోనికా లాంగే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

శృతి లాంటి పేషంట్‌ను తన కెరీర్‌లో చూడలేదని డాక్టర్ లాంగే చెప్పుకొచ్చారు. శృతి చాలా ధైర్యవంతురాలని లాంగే అన్నారు. ‘శృతి అనే 30 ఏళ్ల యువతి కరోనాతో మే మొదటివారంలో ఆస్పత్రిలో చేరింది. అయితే ఆమె ఆస్పత్రిలో చేరినప్పడు ఆమెకు ఐసీయూలో బెడ్ లభించలేదు. కానీ మేం మాత్రం ఎమర్జెన్సీ రూంలో ఆమెను చేర్చుకొని వైద్యం అందించాం. రెండు రోజుల తర్వాత శృతికి ఐసీయూలో బెడ్ దొరకడంతో ఐసీయూకి షిఫ్ట్ చేశాం. శృతి చాలా ధైర్యంగా ఉండేది. ఆమె కుటుంబసభ్యులు కూడా ఎంతో ధైర్యంగా ఉండేవాళ్లు. వారంతా ఎప్పుడూ శృతికి ధైర్యం చెబుతూ మెసెజ్ చేసేవాళ్లు. నువ్వు కరోనాను జయిస్తావని, భయపడొద్దని చెప్పేవాళ్లు. దాంతో కరోనాకు భయపడే వాళ్లందరికీ శృతి ఒక ఉదాహరణగా నిలిచింది. 

కోవిడ్ ఎమర్జెన్సీ వార్డు లోపల ఆక్సిజన్ మీద ఉన్న శృతి తనకు బోర్‌గా ఉందని.. ఫోన్‌లో పాటలు పెట్టుకుంటానని అడిగింది. అందుకు మేం కూడా ఒప్పుకున్నాం. దాంతో శృతి ‘లవ్ యూ జిందగీ’సాంగ్ పెట్టుకొని.. హమ్ చేస్తూ ఎంజాయ్ చేసింది. ఇదంతా నేనే వీడియో తీశాను. ఆ సమయంలో ఆమె తనకు కరోనా సోకిందన్న విషయాన్ని కూడా మరచిపోయింది. ఆమెను చూసిన నాకు చాలా ముచ్చటేసింది. అయితే ఆమె పరిస్థితి బాగాలేదని ఆమెకు తెలియదు. అందుకే ఆమెను కాపాడాలని దేవుడిని కూడా ప్రార్థించాను. కానీ మనం అనుకున్నది జరగకపోవడమే జీవితం కదా. ఏదైనా మన చేతుల్లో లేదు. మేం చేసే వైద్యానికి శృతి రెస్పాండ్ అయినా.. ఆమె శరీరం మాత్రం రెస్పాండ్ కాలేదు. దాంతో మేం ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఆమెను కాపాడలేకపోయాం. మమ్మల్ని క్షమించండి. ఆమె కుటుంబసభ్యులకు దేవుడు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం’ అంటూ డాక్టర్ లాంగే గురువారం ట్వీట్ చేశారు.