వాట్సాప్​లో ఏఐ టెక్నాలజీ

 వాట్సాప్​లో ఏఐ టెక్నాలజీ

ప్రస్తుతం వాట్సాప్​లో కొత్త ఏఐ ఇమేజ్ ఎడిటర్ ఫీచర్​పై పనిచేస్తోంది. ఫ్యూచర్​లో ఈ ఫీచర్​ యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుంది. ఆండ్రాయిడ్ 2.24.7.13 లేటెస్ట్​ వాట్సాప్​ బీటా అప్​డేట్​ ఏఐ పవర్డ్ ఇమేజ్​ ఎడిటర్​ కోడ్​ ఉంటుంది. దీని సాయంతో ఇమేజ్​ బ్యాక్​గ్రౌండ్​ని ఎడిట్​ చేయొచ్చు. ఏఐ టెక్నాలజీ వాడి ఇమేజ్​ను రీస్టయిల్ కూడా చేయొచ్చు.

అంతేకాదు.. కంపెనీ సెర్చ్​ బార్​ నుంచి నేరుగా కంపెనీ మెటా ఏఐ సర్వీస్​కు ప్రశ్నలు అడిగేలా యూజర్లను అనుమతించే ఫీచర్​పై పనిచేస్తోంది. ప్రజెంట్​ ఈ ఏఐ ఫీచర్​ డెవలప్​మెంట్​ స్టేజ్​లో ఉంది. యాప్​ బీటా వెర్షన్ యూజర్లు కూడా టెస్టింగ్ చేయలేరు.

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్​ ఫొటోలను షేర్ చేసేటప్పుడు ఇంటర్​ఫేస్​లో ఫీచర్​ ఫస్ట్ వెర్షన్ కనిపిస్తుంది. హెచ్​డీ ఐకాన్​ ఎడమవైపు పైన గ్రీన్ ఐకాన్​ కనిపిస్తుంది. దీన్ని ట్యాప్ చేయడం ద్వారా బ్యాక్​డ్రాప్​, రీస్టయిల్, ఎక్స్​పాండ్​ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.