సూర్యుడిని గమనించే.. కొత్త ఏఐ మోడల్ సూర్య

సూర్యుడిని గమనించే.. కొత్త ఏఐ మోడల్ సూర్య

స్పేస్‌‌‌‌లోని వాతావరణాన్ని అంచనా వేయడం చాలా కష్టం. దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ టైంని తగ్గించేందుకు నాసా కొన్నేళ్ల నుంచి పనిచేస్తోంది. అందులో భాగంగానే ‘‘సూర్య” పేరుతో ఒక ఏఐ మోడల్‌‌‌‌ని రూపొందించింది. ఐబీఎం సహకారంతో దీన్ని డెవలప్ చేశారు. నాసా ఆధ్వర్యంలో పనిచేసే సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (ఎస్‌‌‌‌డీవో) గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా సేకరించిన డేటా ఆధారంగా ‘సూర్య’కు ట్రైనింగ్ ఇచ్చారు. 

‘సూర్య’ ముఖ్యంగా సోలార్‌‌‌‌‌‌‌‌ ఫ్లేర్స్‌‌‌‌, విస్ఫోటనాలకు సంబంధించిన ముందస్తు సంకేతాలను గుర్తించేందుకు పనిచేస్తుంది. సాధారణంగా వీటి వల్ల ఒక్కోసారి ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, జీపీఎస్‌‌‌‌ నావిగేషన్‌‌‌‌కు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. పవర్ గ్రిడ్ వైఫల్యాలకు కారణం అవుతాయి. అయితే.. ఈ ఏఐ సాయంతో సోలార్‌‌‌‌‌‌‌‌ ఫ్లేర్స్‌‌‌‌ని ముందుగానే గుర్తించగలిగితే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. 

వీటిని ఏఐతో పనిలేకుండా సంప్రదాయ పద్ధతుల్లోనూ గుర్తించొచ్చు. కాకపోతే.. ఏఐ ‘సూర్య’ వాటి కంటే ఎక్కువ కచ్చితత్వంతో, రెండు గంటలు ముందుగానే సౌర ప్రమాదాలను గుర్తించగలుగుతుంది. 

ఏం జరుగుతుంది? 

ఇలాంటి సోలార్‌‌‌‌‌‌‌‌ యాక్టివిటీల వల్ల ఎంతో నష్టం వాటిల్లుతుందని చెప్పడానికి 1859లో జరిగిన కారింగ్టన్ సంఘటనే ఉదాహరణ. అప్పట్లో ఫ్లేర్స్ వల్ల తలెత్తిన జియోమెట్రిక్‌‌‌‌ స్ట్రోమ్‌‌‌‌ వల్ల యూరప్, ఉత్తర అమెరికాలో టెలిగ్రాఫ్ వ్యవస్థలు విఫలమయ్యాయి. కొన్నిచోట్ల మంటలు కూడా చెలరేగాయి.