ముంబై కొత్త మున్సిపల్ కమిషనర్గా భూషణ్ గగ్రాని: EC ఆదేశాలు

ముంబై కొత్త మున్సిపల్ కమిషనర్గా భూషణ్ గగ్రాని: EC ఆదేశాలు

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్త కమిషనర్ ను నియమించారు. ఐఏఎస్ అధికారి భూషణ్ గగ్రానీని బృహన్  ముంబై  మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్ గా నియమించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ బుధవారం (మార్చి 20) ఆదేశించింది.ఇప్పటివరకు BMC కమిషనర్ ఉన్న ఇక్బాల్ సింగ్ చాహల్ స్థానంలో గగ్రానీని నియమించింది ఈసీ. 

ఇప్పటివరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు  ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న గగ్రానీని.. BMC కమిషనర్ పదవి నుంచి తొలగించబడిన ఇక్బాల్ సింగ్ చాహల్ స్థానంలో నియమించారు. ఇటీవల ఇక్బాల్ సింగ్ చాహల్ ను ఎలక్షన్ కమిషన్ ఇటీవల BMC  కమిషనర్ విధులనుంచి తొలగించింది. 

ALSO READ :- టార్గెట్ 2024: రాజోలుపై ప్రత్యేక దృష్టి పెట్టిన పవన్..

మరోవైపు సీనియర్ అధికారులు అయిన సౌరభ్ రావు, కైలాష్ షిండేలను థానే, నవీముంబై కొత్త సివిక్ కమిషనర్లుగా నియమించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మార్చి 16న లోక్ సభ ఎన్నికల షఎడ్యూల్ ను ప్రకటించిన వెంటనే BMC కమిషనర్, అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తున్న చాహల్ తో పాటు మరికొంతమంది సీనియర్ అధికారులను బదిలీ చేస్తూ EC ఆదేశాలు జారీ చేసింది. వారిని సొంత జిల్లాల్లో పోస్ట్ చేయనున్నారు. కాగా మహారాష్ట్రలో ఏప్రిల్ మే లో ఐదు దశల్లో 48 స్థానాలకు పోలింగ్ జరగనుంది.