అమెరికా కొత్త గైడ్ లైన్స్.. వాళ్లకు మాస్క్ అవసరం లేదు

అమెరికా కొత్త గైడ్ లైన్స్.. వాళ్లకు మాస్క్ అవసరం లేదు

మాస్కులకు సంబంధించి అమెరికన్లకు కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది ఆ దేశ టాప్ హెల్త్ ఏజెన్సీ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు ఇక మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఐతే ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, అస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని ప్రకటించింది సీడీసీ. వ్యాక్సిన్ తీసుకోకపోయినా..2 డోసులు పూర్తి కాకపోయిన మాస్కు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ రెండో డోసు వేసుకున్న రెండు వారాల తర్వాత మాస్కు వాడడం మానేయోచ్చని ప్రకటించింది. ప్రయాణాలకు ముందు, తర్వాత కరోనా టెస్టులు అవసరం లేదని ప్రకటించింది. ప్రయాణం తర్వాత క్వారంటైన్, ఐసోలేషన్ అవసరం లేదని తెలిపింది. CDC ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారు అమెరికన్ అధ్యక్షుడు జో బిడెన్. అమెరికన్లకు వేగంగా వ్యాక్సిన్ వేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. కరోనాపై పోరాటంలో ఇదో గొప్ప రోజన్నారు. 114 రోజుల్లో 25 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించామని వెల్లడించారు.