మంచిర్యాల జిల్లాలో బాధ్యతలు చేపట్టిన కొత్త కలెక్టర్లు

మంచిర్యాల జిల్లాలో బాధ్యతలు చేపట్టిన కొత్త కలెక్టర్లు

నిర్మల్/నస్పూర్, వెలుగు: నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు కొత్త కలెక్టర్లుగా అభిలాష అభినవ్, కుమార్​దీపక్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్​కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్​లో అభిలాష అభినవ్ బాధ్యతలు చేపట్టారు. ఆమెకు ఆర్డీఓ, ఇతర జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా శ్రేయస్సు, జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్​లోని కలెక్టరేట్​లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమ, అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హత గల ప్రతి ఒక్కరికి అందేలా అధికార యంత్రాంగంతో కలిసి పనిచేస్తానన్నారు. కొత్త కలెక్టర్​కు జిల్లా అడిషనల్ కలెక్టర్లు బి.రాహుల్, సబావత్ మోతిలాల్ స్వాగతం పలికారు.