చార్జ్ తీసుకున్న కొత్త కలెక్టర్లు

చార్జ్ తీసుకున్న కొత్త కలెక్టర్లు

హైదరాబాద్ సిటీ/మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొత్త కలెక్టర్లుగా హరిచందన దాసరి,  మిక్కిలినేని మను చౌదరి శుక్రవారం బాధ్యతలు  స్వీకరించారు. హైదరాబాద్​లో అదనపు కలెక్టర్లు స్వాగతం పలికిన అనంతరం నేరుగా తన చాంబర్ కు వెళ్లిన హరిచందన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. 

కీసర గుట్టలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు చేసిన అనంతరం మిక్కిలినేని మను చౌదరి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు ఆయా అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.