జపాన్ లో మరో కొత్త వైరస్

జపాన్ లో మరో కొత్త వైరస్

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా.. కొత్త రూపు దాల్చింది. చైనాలో పుట్టిన ఈ వైరస్.. అమెరికా, యూకే, భారత్ తో పాటు అనేక దేశాల్లో సెకండ్ వేవ్ తో తన ప్రతాపం చూపిస్తోంది. అయితే, జపాన్ లో మాత్రం ఫోర్త్ వేవ్ తో విజృంభిస్తోంది. మరో మూడున్నర నెలల్లో ఒలింపిక్స్‌ మొదలుకానున్న సమయంలో ఫోర్త్ వేవ్‌ ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వైరస్‌ వేరియంట్లు ప్రజలను భయపడుతున్నాయి. ప్రస్తుతం జపాన్‌లో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు ఎప్పటికప్పుడు కొత్త మ్యుటేషన్లు బయటపడుతున్నాయి. తాజాగా జపాన్‌లోని ‘ఈక్‌’ మ్యుటేషన్‌ బయటపడింది. టోక్యో నగరంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈక్‌ మ్యుటేషన్‌ విస్తరిస్తోంది. అయితే.. టోక్యోలో వస్తున్న కరోనా కేసుల్లో 70 శాతం కేసుల్లో ఈక్‌ వేరియంట్‌ నిర్థారణ అయినట్లు జపాన్‌ అధికారులు తెలిపారు. ఒసాకా నగరంలో ఈ వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తోందంటున్నారు నిపుణులు. ప్రజలు అలర్ట్ గా ఉండి..కరోనా రూల్ పాటించాలని సూచిస్తున్నారు. మాస్క్ తో పాటు భౌతిక దూరం తప్పని సరి అని అంటున్నారు.