అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త కోర్సులు: సబితా ఇంద్రారెడ్డి

అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త కోర్సులు: సబితా ఇంద్రారెడ్డి
  • మహిళా యూనివర్సిటీ లోగో ఆవిష్కరణ 

హైదరాబాద్, వెలుగు: కొత్తగా ఏర్పాటైన మహిళా యూనివర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సిలబస్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సెక్రటేరియెట్​లో విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ఆర్.లింబాద్రితో కలిసి తెలంగాణ మహిళా యూనివర్సిటీ 'లోగో'ను ఆమె విడుదల చేశారు. 

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ... విద్యా సౌకర్యాలు, విద్యార్థినులకు కావాల్సిన వసతులు ఎప్పటి కప్పుడు మెరుగుపరచాలని కోరారు. ఉన్నత విద్యలో మహిళలు ముందంజలో ఉండేందుకే మహిళా వర్సిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. వర్సిటీ ఏర్పాటుతో ఉన్నత విద్యలో మహిళల భాగ స్వామ్యం మరింతగా పెరిగిందన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్​లర్ రవీందర్ యాదవ్, తెలంగాణ మహిళా యూనివర్సిటీ ఇన్​చార్జి  వైస్ చాన్స్ లర్ విజ్జులత తదితరులు పాల్గొన్నారు.