న్యూఢిల్లీ: ఇండియాలో 25 ఏళ్ల తర్వాత మొదటిసారిగా అరుదైన మెదడు క్యాన్సర్‌కు ప్రధాన చికిత్స అందుబాటులోకి వచ్చింది. వొరసైడ్‌నిబ్ (వొరనిగో) మందును ఇండియాలో అమ్మడానికి సర్వియర్ ఇండియాకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) అనుమతులు ఇచ్చింది. ఈ మందు కిందటేడాది ఆగస్టులో యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతులు పొందింది. 12 ఏళ్ల పైబడిన గ్రేడ్ 2 ఐడీహెచ్‌మ్యూటెంట్ గ్లియోమా రోగుల చికిత్సలో వొరనిగోని వాడతారు.
ఈ మందు ధరను ఇండియాలో తక్కువగా ఉంచి అందుబాటులోకి తేవాలని సర్వియర్ ప్లాన్ చేస్తోంది. ఇండియాలో ఈ టైప్ బ్రెయిన్ క్యాన్సర్ కేసులు ఏడాదికి సుమారు 4,500 దాటుతున్నాయి. రసాయన చికిత్సల మాదిరిగా ఆరోగ్యకర కణాలను దెబ్బతీయకుండా, ఐడీహెచ్1/ఐడీహెచ్2 మ్యూటేషన్‌ను అడ్డుకుని ట్యూమర్ పెరుగుదలను వొరనిగో తగ్గిస్తుంది. కాగా, బ్లడ్ క్యాన్సర్ చికిత్స కోసం టిబ్సోవో మందును సర్వియర్ ఇప్పటికే అమ్ముతోంది.

