కరోనా పేషంట్ల అడ్మిషన్ కోసం కేంద్రం కొత్త గైడ్‌లైన్స్

కరోనా పేషంట్ల అడ్మిషన్ కోసం కేంద్రం కొత్త గైడ్‌లైన్స్

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో ఆస్పత్రుల్లో అడ్మిట్ అయ్యేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. కాగా.. కరోనా పేషంట్లను చేర్చుకోవడంలో ఆస్పత్రులు వాటికవే రూల్స్ పెట్టుకున్నాయి. పేషంట్‌ను అడ్మిట్ చేసుకోవాలంటే.. ఐడీ కార్డు, లోకాలిటీ, పాజిటివ్ రిపోర్ట్ మొదలైనవన్నీ కావాలని ఆస్పత్రులు అడుగుతున్నాయి. దాంతో పేషంట్లు, వారి బంధువులు తీవ్ర ఇబ్భందులు పడుతున్నారు. వీటన్నింటిని గమనించిన కేంద్ర ప్రభుత్వం.. పేషంట్ల అడ్మిషన్ విధానంలో మార్పులు చేసింది.

కరోనా పేషంట్ల హాస్పిటల్స్ అడ్మిషన్ కోసం కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసింది. పేషంట్ల అవసరాన్ని బట్టే అడ్మిషన్ ఇవ్వాలని కేంద్రం సూచించింది. అడ్మిషన్ అవసరం లేని వారికి బెడ్ ఇవ్వొద్దని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు ఉన్నాకూడా ఆస్పత్రుల్లో చేరొచ్చని కేంద్రం తెలిపింది. అదేవిధంగా అడ్మిషన్‌కు కరోనా పాజిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. స్థానికుడా లేదా అనే విషయాన్ని పక్కనబెట్టి అడ్మిట్ చేసుకోవాలని సూచించింది. దాంతో కరోనా సోకిన పేషంట్లు దేశంలోని ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనైనా వైద్యం చేయించుకోవచ్చు.