వెదర్ ఎఫెక్ట్ : ప్రతి ఇంట్లో దగ్గు, జలుబు, జ్వరాలు

వెదర్ ఎఫెక్ట్ : ప్రతి ఇంట్లో దగ్గు, జలుబు, జ్వరాలు

గత కొద్ది రోజులుగా తెలంగాణలో చలి వణికిస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో అయితే ఇక చలి గురించి చెప్పనవసరం లేదు.. ఉదయం, రాత్రి వేళ్లల్లో పిల్లలు, వృద్దులు గజగజా వణికిపోతున్నారు. చలి కారణంగా ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. చలికాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఈ కాలంలో ఎక్కువగా ఫ్లూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా చిన్న పిల్లలు, వృద్ధులు చలి నుంచి కాపాడుకొనేందుకు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. లేకపోతే వారిలో త్వరగా శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వెల్లడించారు. 

వాతావరణ మార్పుల వల్ల పిల్లల్లో కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. దీంతో చిన్న పిల్లలు అంటు వ్యాధుల బారిన పడకుండా రోగ నిరోదక శక్తి పెరగడానికి పరిశుభ్రతను పాటిస్తూ.. సరైన ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అంటు వ్యాధులతో బాధరపడుతున్న పిల్లలను రక్షించుకోవడానికి ప్రతి ఇంట్లో దగ్గు, జలుబు, జ్వరం వంటి మందులను స్టోర్ చేసుకోని పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యమని.. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. పిల్లలకు జ్వరం లేదా జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే, తక్షణమే శిశువైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఈ అనారోగ్య సమ్యలను ఎదుర్కోవడానికి, పిల్లలను వెచ్చగా ఉంచడం.. ఆరుబయట చలికి గురికాకుండా ఉండటం చాలా ముఖ్యం. పిల్లలు రాత్రిపూట ఆరుబయట ఆడుకోకూడదని, తెల్లవారుజామున అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

ఉదయం, సాయంత్రం వాతావరణంలో మార్పులు, ఉదయపు వేడి పెరగడం, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గడం వంటివి పిల్లల ఆరోగ్యంపై వాతావరణ మార్పుల ప్రభావానికి దోహదపడతాయని సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ మహమ్మద్ అలీ తెలిపారు. ఈ ప్రభావాల నుంచి పిల్లలను రక్షించడానికి, వారు చల్లని నీరు, పానీయాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. మారుతున్న వాతావరణం కఠినత్వం నుంచి పిల్లలను రక్షించడానికి చురుకైన చర్యలు తీసుకోవాలని వైద్యులు వెల్లడించారు.