మార్చి నెల చివరలో కొత్త జడ్జిల ప్రమాణం

మార్చి నెల చివరలో కొత్త జడ్జిల ప్రమాణం

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ సుజయ్ పాల్ ఈ నెల 26న, జస్టిస్ మౌసమీ భట్టాచార్య ఈ నెల 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు చీఫ్​జస్టిస్ అలోక్ అరాధే హైకోర్టు

మొదటి హాల్ లో వాళ్లతో ఉదయం 10 గంటలకు ప్రమాణం చేయించనున్నారు. జస్టిస్ సుజయ్ పాల్ మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి, జస్టిస్ మౌసమీ భట్టాచార్య కలకత్తా హైకోర్టు నుంచి బదిలీపై వస్తున్నారు.