న్యూఢిల్లీ: కమర్షియల్ పార్ట్‌నర్ లేక ఆగిపోయిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) వచ్చే నెల 14 నుంచి జరుగుతుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం వెల్లడించారు. మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్‌తో సహా మొత్తం 14 క్లబ్‌లు ఇందులో పాల్గొంటాయన్నారు.
ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) ఇచ్చిన ఫైనాన్షియల్ మోడల్‌ను వ్యతిరేకించడంతో ఐఎస్‌ఎల్ గత ఆరు నెలలుగా వాయిదాపడుతూ వస్తోంది. ఇదే సమస్యతో ఆగిపోయిన సెకండ్ డివిజన్ ఐ–లీగ్ పోటీలు కూడా దాదాపుగా ఇదే టైమ్‌లో జరగనున్నాయి. ఇందులో 11 క్లబ్‌లు ఆడనున్నాయి.
